Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 4:45 pm Posted by : ramakrishna

ఘనంగా పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు

 

. . . గజమాలతో ఘన సత్కారం

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు, మాజీ ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాన్సువాడ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డికి పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. డీజే , బాణాసంచా పేలుళ్లు, నినాదాల మధ్య భారీ ర్యాలీ నిర్వహించి జన్మదిన వేడుకలను ఉత్సవ వాతావరణంలో జరిపారు. అభిమానులు “హ్యాపీ బర్త్‌ డే పీబీఆర్” అంటూ ప్రత్యేక ప్లకార్డులు ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి కేక్లు పంపిణీ చేయడంతో పాటు పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భాస్కర్ రెడ్డి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో దీర్ఘాయుష్షుతో ఉండాలని అభిమానులు ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని పోచారం భాస్కర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

 

Pocharam Bhaskar Reddy's birthday celebrations held on a grand scale.