పోచమ్మ ఆలయం భూమి కబ్జా
ప్రజావాణిలో ఫిర్యాదు బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని దళితవాడ సమీపంలో పోచమ్మలయం కబ్జా చేశారని సోమవారం ప్రజావాణిలో కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. హరిజనవాడ కాలనీవాసులు మాట్లాడుతూ కొందరు వ్యక్తులు భూమి మాదని పోచమ్మ ఆలయం దగ్గర ఉన్న చెట్టును నరికి వేయడంతో పాటు మా మనోభావం దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశామన్నారు. ఆలయాల జోలికి వస్తే ఊరికినేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు.