Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 October 2025, 6:25 pm Posted by : ramakrishna

ఘనంగా పోచమ్మ బోనాల మహోత్సవం

బతుకమ్మ, బోధన్: బోధన్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల పండుగను గ్రామ కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అన్ని కులాల ప్రజలు ఐకమత్యంతో పాల్గొని పండుగను సంప్రదాయోత్సాహాలతో జరిపారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పంటల కోత ప్రారంభానికి ముందుగా గ్రామ రక్షకదేవత అయిన పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామంలోని ప్రతి గడప నుండి మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో, వడివడిగా మంగళహారతులతో బోనాలను మోస్తూ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి వచ్చి బోనం సమర్పించారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామస్తులు ఆరోగ్యసమృద్ధులతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు, నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, వివిధ కులాల ప్రముఖులు, యువత, స్త్రీపురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Pochamma Bonala festival celebrated in grand style