న్యూమోనియా నివారణ మన చేతుల్లోనే
. . . మెడికవర్ హాస్పిటల్స్ ప్రముఖ పల్మోనలోజిస్ట్ డా.ప్రశాంత్ నిజామాబాద్ సిటి, బతుకమ్మ : ప్రతి సంవత్సరం నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ న్యూమోనియా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవం ఉద్దేశ్యం న్యూమోనియా వ్యాధి తీవ్రత, నివారణ, ముందస్తు చికిత్స అవసరంపై ప్రజల్లో అవగాహన పెంపొందించమన్నారు. న్యూమోనియా అనేది ఊపిరితిత్తులలో బాక్టీరియా, వైరస్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే శ్వాసకోశ వ్యాధి అని అన్నారు. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ప్రాణాపాయకరంగా మారే అవకాశం...