Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 November 2025, 4:15 pm Posted by : ramakrishna

న్యూమోనియా నివారణ మన చేతుల్లోనే

. . . మెడికవర్ హాస్పిటల్స్ ప్రముఖ పల్మోనలోజిస్ట్ డా.ప్రశాంత్

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : 

 

ప్రతి సంవత్సరం నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ న్యూమోనియా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవం ఉద్దేశ్యం న్యూమోనియా వ్యాధి తీవ్రత, నివారణ, ముందస్తు చికిత్స అవసరంపై ప్రజల్లో అవగాహన పెంపొందించమన్నారు. న్యూమోనియా అనేది ఊపిరితిత్తులలో బాక్టీరియా, వైరస్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే శ్వాసకోశ వ్యాధి అని అన్నారు. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ప్రాణాపాయకరంగా మారే అవకాశం ఉంటుందన్నారు. న్యూమోనియా లక్షణాలు అధిక జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి, అలసట అని, ఈ  లక్షణాలను ప్రారంభ దశలో గుర్తించడం, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యంత ముఖ్యమైందన్నారు. సాధారణంగా ఈ వ్యాధి వ్యాక్సినేషన్, శుభ్రమైన వాతావరణం, సరైన పోషకాహారం శ్రద్ధతో నివారించవచ్చన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో)  ప్రకారం, న్యూమోనియా ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లల మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉందన్నారు. కానీ ఇది పూర్తిగా నివారించగలిగిన, చికిత్స చేయగలిగిన వ్యాధి అని అందుకే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లకు జాగ్రత్తగా ఉండడం అవసరం. నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ యూనిట్‌లో ప్రతి సంవత్సరం న్యూమోనియా దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, ఉచిత శ్వాసకోశ పరీక్షలు,  వైద్య సలహాలు అందజేయబడుతున్నాయన్నారు. మా వైద్య నిపుణుల బృందం శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిర్ధారణ, చికిత్స, నివారణలో అత్యాధునిక సదుపాయాలను ఉపయోగిస్తోందన్నారు.

నిర్లక్ష్యంగా వదిలేస్తే ప్రాణాపాయ పరిస్థితులకు దారితీస్తుంది : డా.ప్రశాంత్

న్యూమోనియా ఒక సాధారణమైనదే అయినా నిర్లక్ష్యంగా వదిలేస్తే ప్రాణాపాయ పరిస్థితులకు దారితీస్తుందని మెడికవర్ హాస్పిటల్స్ శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డా.ప్రశాంత్ అన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం, శ్వాసకోశ ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం, మొదటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఎంతో ముఖ్యమన్నారు. న్యూమోనియా పై అవగాహన పెంపొందించడం అంటే కేవలం రోగాన్ని నివారించడం మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి వ్యక్తి శ్వాస ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అన్నారు. ఈ ప్రపంచ న్యూమోనియా దినోత్సవం సందర్భంగా మనం మన ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకునే సంకల్పంతో ముందుకు సాగుదాం.

Pneumonia prevention is in our hands