Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 November 2024, 2:14 pm Posted by : ramakrishna

కుల గణనకు ప్రధాని మోదీ వ్యతిరేకి

 . . పద్మశాలీలు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకుందాం . . తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ..

 

కులగనన విషయంలో కేంద్ర సర్కార్ ప్రధాని నరేంద్ర మోడీ పూర్తిగా వ్యతిరేఖంగా ప్రవర్తిస్తున్నారని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్  ఈరవత్రి అనిల్ ఆరోపించారు. నగరం లోని కోటగల్లి లోని నగర పద్మశాలి సంఘం కళ్యాణ మండప పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఆయన కళ్యాణ మండపాన్ని నూడా చైర్మన్ కేశ వేణులతో రిబ్బన్ కట్ చేసి మండపాన్ని ప్రారంభించారు. అంతకుముందు మార్కండేయ మందిరంలో  అనిల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణ మండప భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో అనిల్ మాట్లాడుతూ  ఐక్యంగా ఉండి పద్మశాలీలుతమ హక్కులను సాధించుకోవాలని కోరారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇటీవల ప్రధానంగా వినిపిస్తున్న కుల జనన విషయం ప్రధానమైందన్నారు. కుల జణన జరగకపోతే ప్రధానంగా నష్టపోయేది బీసీల అని అన్నారు. అగ్రవర్ణాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదని కానీ బీసీలకు కూడా అంతే స్థాయిలో న్యాయం జరిగేలా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు. దీనివల్ల బీసీలు అత్యధికంగా నష్టపోతున్నారని, చదువు,వ్యాపారం, రాజకీయపరంగా తీవ్రంగా నష్టపోతున్నామని గుర్తు చేశారు కుల జనన చేస్తే కేవలం పద్మశాలీల కులస్తులు మాత్రమే లబ్ధి పొందరని, సమాజంలో ఉన్న అన్ని కులాల వారికి న్యాయం జరుగుతుందన్నారు. అదేవిధంగా నూతనంగా ప్రారంభించిన కళ్యాణ మండపంలో పద్మశాలి లో ఎంతోమంది పేదవారికి వారి బిడ్డల పెళ్లిళ్ల కోసం ఈ ఫంక్షన్ హాల్ ఉపయోగపడేలా బాధ్యులు కృషి చేయాలన్నారు. ఈ ఫంక్షన్ హాల్లో కేవలం పద్మశాలీలకు చెందిన ఫంక్షన్లో, పెళ్లిళ్లు కాకుండా అన్ని కులాల వారికి ఉపయోగపడేలా వాడితే ఇందు ద్వారా వచ్చిన ఆదాయాన్ని పద్మశాలి లో ఉన్న పేద కుటుంబంలో ఉన్న విద్యార్థుల చదువుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు.  కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు వెంకట నరసయ్య, ప్రధాన కార్యదర్శి ఏనుగందల మురళి, ఉపాధ్యక్షుడు వెంకట నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

 

PM Modi is against caste enumeration