నిజాంసాగర్ ప్రాజెక్టులో పుష్కలంగా సాగు నీరు
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నిజాంసాగర్, బతుకమ్మ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులో పుష్కలంగా సాగు నీరు ఉందని రెండు పంటలకు ధోకా లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. ఆయన మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం,నీటి నిల్వ,ఇన్ ఫ్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత 40 రోజులుగా నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి వరద గేట్ల ద్వారా కొనసాగుతున్న...