బాల్య వివాహాలను అరికట్టాలని ప్రతిజ్ఞ

బతుకమ్మ భిక్కనూరు:  బాల్య వివాహాలను అరికట్టాలని ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం వైద్య సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. నిర్ణీత వయసు వచ్చిన తర్వాత మాత్రమే వివాహం చేయాలని బాల్య వివాహం చట్టరీత్యా నేరమని గ్రామాలలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని వైద్యాధికారి దివ్య సూచించారు. గ్రామాలలో బాల్యవివాహాలు ఎవరైనా ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాజమణి, ల్యాబ్ టెక్నీషియన్ వనశ్రీ, స్టాఫ్ నర్స్ హరిత, ఫార్మసిస్ట్ స్వామి, హెల్త్ అసిస్టెంట్ సతీష్,...