Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 7:11 pm Posted by : ramakrishna

అంబేద్కర్ జయంతి సందర్భంగా రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

అంబేద్కర్ జయంతి సందర్భంగా అరైవ్ అలైవ్కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద మంగళవారం రోడ్డు భద్రతపై అవగాహన, ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యత, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు, హెల్మెట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు.

 

Pledge on road safety on the occasion of Ambedkar Jayanti

 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ సురక్షితంగా ప్రయాణిస్తామని ప్రతిజ్ఞ చేశారు. మున్సిపల్ చైర్మన్ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ హాజరై రోడ్డు భద్రతపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీఐ డి.రాజారెడ్డి, ఎస్సై బి. మహేష్, ఎస్సై-2 బాలసుబ్రహ్మణ్య చారి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.