హెల్మెట్ పెట్టుకోండి అన్న . . .
హెల్మెట్ లేని వాహనదారులకు రాఖీ కట్టిన మహిళ పోలీసులు కామారెడ్డి, బతుకమ్మ : రాఖీ పండుగను పురస్కరించుకుని కామారెడ్డి ట్రాఫిక్ పోలీసులు వినూత్నకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారికి మహిళ పోలీసులు ప్రేమతో రాఖీ కట్టి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కామారెడ్డి డీఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్‌ఐ చంద్రశేఖర్ గౌడ్, మహిళా ట్రాఫిక్ సిబ్బంది పోలీస్ స్టేషన్ ఎదుట వాహనదారులకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. హెల్మెట్...