లీకేజీ సరిచేయండి సార్లూ..

వాటర్ గ్రిడ్ పైపు లీకేజీ తో తీవ్ర ఇబ్బందులు   ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల మండల కేంద్రంలోని గంగారం తండా గ్రామపంచాయతీ పరిధిలో హైవే రోడ్ ప్రక్కనగల బైపాస్ రోడ్డు ప్రక్కన వాటర్ గ్రిడ్ పైప్ లీకేజీ కావడంతో నీరు రోడ్డు మీదికి రావడం జరుగుతుందని కాలనీవాసులు తెలిపారు. పైపు లీక్ కావడంతో తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని అన్నారు. మిషన్ భగీరథ అధికారులు స్పందించి వెంటనే లీకేజీ అయిన పైపులు సరిచేసి రోడ్డు మీదికి నీరు రాకుండా చూడాలని కోరారు.