ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీలు సక్సెస్
నిజామాబాద్ , బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్లకు వేదికైంది. ఇటీవల హృద్రోగ వ్యాధిగ్రస్తులకు విజయవంతంగా చికిత్స చేసి జీజీహెచ్ లో ఇప్పుడు ఏకంగా ప్లాస్టిక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించి వైద్యులు సూపర్ స్పెషాలిటీ వైద్యానికి కేరాఫ్ అని చెప్పకనే చెప్పారు. కాస్లీ వైద్యాన్ని పేదలకు ఉచితంగా ధర్మాసుపత్రిలో అందించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలమౌతున్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొ.డా.నాగమోహన్ తెలిపారు. నిజామాబాద్ కు చెందిన మమత అనే రోగికి దీర్ఘకాలికంగా కాలు భాగంలో మానని గాయం (Chronic...