Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 July 2025, 7:35 pm Posted by : ramakrishna

ఎండిన మొక్కల స్థానంలో మొక్కలు నాటాలి

మెండోరా, బతుకమ్మ: వన మహోత్సవ కార్యక్రమంలో నాటిన మొక్కలు ఎక్కడెక్కడ ఎండిపోయాయో వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలని డిఆర్డిఏ పిడి సాయి గౌడ్ అన్నారు. మెండోరా మండల కేంద్రంలో సోమవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నాల్గవ సామాజిక తనిఖీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ ఎం ఎం హాజరు విషయంలో ఎటువంటి అంతరాయం కలిగిన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అందరికీ డబ్బులు వచ్చే విధంగా కృషి చేయాలని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో విజిలెన్స్ అధికారి నారాయణ, శ్రీనివాస్, ఎంపీడీవో లక్ష్మణ్, ఏపీఓ అశోక్, ఈసీ పూర్ణచందర్, టెక్నికల్ అసిస్టెంట్లు ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు తదితరులు పాల్గొన్నారు.