మొక్కలు నాటిన నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు
బతుకమ్మ, అర్మూర్ పర్యావరణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత అని నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్ అన్నారు. శనివారం ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనం లో నవనాతపురం ప్రెస్ క్లబ్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రత ,భీమా వంటి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామన్నారు . అనంతరం ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు .మొక్కలు నాటడం పర్యావరణాన్ని రక్షించుకోవడంతో పాటు...