Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 August 2024, 2:44 pm Posted by : ramakrishna

మొక్కలు నాటిన నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు

బతుకమ్మ, అర్మూర్

పర్యావరణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత అని నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్ అన్నారు. శనివారం ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనం లో నవనాతపురం ప్రెస్ క్లబ్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రత ,భీమా వంటి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామన్నారు ‌. అనంతరం ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు .మొక్కలు నాటడం పర్యావరణాన్ని రక్షించుకోవడంతో పాటు మంచి స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుందన్నారు. మానవుని జీవన మనుగడకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయన్నారు. మొక్కలు నాటడం వాటిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేశారు. ప్రతి ఇంటి ముందు రెండు మొక్కలు నాటి వాటి పూర్తి బాధ్యత తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇట్టి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు సాత్పుతే శ్రీనివాస్, టి. యు .డబ్ల్యు. ఐ .జే .యు జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవ్ పార్థమ్ ,ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు ముద్రకోలా వినోద్, ప్రధాన కార్యదర్శి మహేష్ ,కోశాధికారి మహిపాల్ ,కార్యవర్గ సభ్యులు రాజేందర్, దినేష్ మాజీ అధ్యక్షుడు గంగా మోహన్ ,అమృతాల శ్రావణ్ ,చరణ్ గౌడ్ , అజీమ్ ,తమ్మి వినోద్ ,చిరంజీవి, గటడి అరుణ్, నిషిత్ ,ముఖేష్, లిక్కీ శ్రావణ్ ,కిరణ్ ,అశోక్ ,బారడ్ గణేష్ ,బొడ్డు శ్రవణ్ ,రాజ్ కుమార్ ,మిరియాల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.