విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ప్రణాళికలు
హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ప్రణాళికలు చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ రంగంపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి, భవిష్యత్ అవసరాలపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2047 వరకు 3 ట్రిలియన్‌ల ఎకానమీ చేరాలన్నదే లక్ష్యమన్నారు. ఉత్పత్తి రంగాలు అభివృద్ధి చెందితేనే ఎకానమీ ఆశించిన స్థాయిలో పెరుగుతుందన్నారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరాలతో అభివృద్ధి చేస్తామన్నారు. పదేళ్లుగా రాష్ట్రంలో పవర్ డిమాండ్ భారీగా పెరుగుతుందన్నారు....