Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 November 2025, 2:29 pm Posted by : ramakrishna

విద్యుత్‌ అవసరాలను తీర్చేందుకు ప్రణాళికలు

హైదరాబాద్, బతుకమ్మ :  రాష్ట్రంలో విద్యుత్‌ అవసరాలను తీర్చేందుకు ప్రణాళికలు చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్‌ రంగంపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి, భవిష్యత్ అవసరాలపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  2047 వరకు 3 ట్రిలియన్‌ల ఎకానమీ చేరాలన్నదే లక్ష్యమన్నారు. ఉత్పత్తి రంగాలు అభివృద్ధి చెందితేనే ఎకానమీ ఆశించిన స్థాయిలో పెరుగుతుందన్నారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరాలతో అభివృద్ధి చేస్తామన్నారు. పదేళ్లుగా రాష్ట్రంలో పవర్‌ డిమాండ్‌ భారీగా పెరుగుతుందన్నారు. 2026 ఏప్రిల్‌ నాటికి 24,769 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. 2047నాటికి 39 వేల మెగావాట్ల విద్యుత్‌ అవసరమన్నారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, పెట్టుబడుల ఒప్పందం, డేటా సెంటర్లతో హైదరాబాద్‌ గ్లోబల్‌ హబ్‌గా మారబోతుందన్నారు. వాడే విద్యుత్‌లో 50 శాతం గ్రీన్‌ ఎనర్జీ వాడాలన్నారు. ఎనర్జీ స్టోరేజీ గతంలో లేదన్నారు. సోలార్, థర్మల్‌, విండ్‌ పవర్‌ స్టోరేజీలో వెనకబడి ఉన్నామన్నారు. విద్యుత్‌ ఉత్పత్తి పెంచుకోకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. 2027-28 వరకు థర్మల్‌ పవర్‌లో ఇబ్బంది లేదన్నారు. 2029-30 వరకు వెయ్యి మెగావాట్ల మైనస్‌లోకి వెళ్తామన్నారు.