భూధార్ నెంబ‌ర్ల కేటాయింపున‌కు ప్ర‌ణాళిక‌లు రూపొందించాలి

మ్యుటేష‌న్ల ప్ర‌క్రియ త్వ‌ర‌గా పూర్తి చేయాలి వినియోగ‌దారుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఇంటిగ్రేటెడ్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాలు నెలాఖ‌రులోగా ఇందిర‌మ్మ ఇండ్ల ప్రారంభోత్స‌వం రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ‌ల స‌మీక్ష‌లో సీఎం రేవంత్ రెడ్డి   హైదరాబాద్‌, బతుకమ్మ:  రాష్ట్రవ్యాప్తంగా భూముల‌కు భూధార్ నెంబ‌ర్ల కేటాయింపున‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ‌ల‌పై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధ‌వారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు. రెవెన్యూ స‌ద‌స్సుల్లో వార‌స‌త్వ‌, ఇత‌ర మ్యుటేష‌న్ల‌కు సంబంధించి స్వీక‌రించిన...