Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 February 2025, 6:41 pm Posted by : ramakrishna

కామారెడ్డిలో బెల్లం ఉత్పత్తికి ప్రణాళిక

  • వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం

 

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డిలో బెల్లం ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ఆంద్ర్రప్రదేశ్ లోని అనకాపల్లి బెల్లం తయారీ కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సోమవారం సందర్శించింది. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాతరాజు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఎస్సీ, ఏస్టి, బిసి, మైనార్టీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సహాయ సహకారాలతో కామారెడ్డి నియోజకవర్గంలో బెల్లం ఉత్పత్తి రంగాన్ని పెంచి రైతులు చెరుకును ఉత్పత్తి చేయించి పూర్వవైభవం తీసుకువస్తామన్నారు. చెరుకు నజరానా తీపి ఖజానా బెల్లం ముడి సరుకును ఉత్పత్తి చేసి మళ్లీ మార్కెట్లోకి వచ్చే విధంగా ప్రణాళికలు తయారు చేయడం కోసం అక్కడ అనకాపల్లిలోని బెల్లం తయారీ కేంద్రాన్ని సందర్శించినట్లు తెలిపారు. ఉత్పత్తి ఆర్థిక అభివృద్ధి అంశాలను అడిగి తెలుసుకున్నామని తెలిపారు. చెరుకు ఉత్పత్తిదారులకు సరైన విధంగా సహాయ సహకారాలు అందించి బెల్లము ఉత్పత్తిని పెంచడం కోసమే అనకాపల్లి పర్యటన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం చైర్మన్ పాత రాజు, వైస్ చైర్మన్ స్వామి, కార్యదర్శి నరసింహులు, డైరెక్టర్స్ షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు.

Plan for jaggery production in Kamareddy