. . . హత్య చేసి కాల్చివేసిన అగంతకులు
ఎల్లారెడ్డి, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది.లింగంపెట్ మండలం భానాపూర్ అటవీ ప్రాంతంలో పోచయ్య (70) అనే వ్యక్తి నీ హత్య చేసి కాల్చి దహనం చేశారు. ఈ సంఘటన మంగళవారం వెలుగు లోకి వచ్చింది. పోచయ్య స్వగ్రామం పిట్లం మండలం లో నీ బోలక్ పల్లి గ్రామ మని తెలిసింది. పిట్లం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోచయ్యను హత్య చేసింది పరిచయస్తులే అని గుర్తించిన పోలిసులు వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వారు ఇచ్చిన సమాచారంతోనే హత్య జరిగిన ప్రాంతంలో అనవాళ్ల ను సేకరించారు.