. . . 180 మంది ప్రయాణికుల సురక్షితం
వెబ్ డెస్క్, బతుకమ్మ :
ఫ్లై దుబాయ్ విమానాన్ని ఒక సహ పైలెట్ కుట్రతో కూల్చివేయాలన్న ప్రయత్నాన్ని వమ్ము చేసి 180 మంది ప్రయాణికులను సురక్షితంగా భూమికి చేర్చిన భారతీయ పైలెట్ మచ్చర్ ను ఆకాశవీరుడుగా కీర్తిస్తున్నారు. అమెరికాలోని ప్రముఖ పత్రికలు , చానల్స్ మచర్ ను హీరో ఆఫ్ ది స్కై అంటూ పొగుడుతూ వార్తలు ప్రసారం చేస్తున్నారు. విమానాన్ని కూల్చేయాలని ప్రయత్నం చేసిన తన సహ పైలెట్ తనను కత్తితో పొడిచినా ,అతడిని ఓపిగ్గా కంట్రోల్ చేసుకుంటూ, అదుపులో పెట్టుకుని విమానాన్ని క్షేమంగా సౌదీ అరేబియాలో దించేసిన వీరుడు మచ్చర్ భారతీయుడే. గతంలో స్పైస్ జెట్ విమానాల్లో పదేళ్లు పైలెట్ గా పనిచేశారు . నాలుగేళ్ల క్రితం ఫ్లైదుబాయిలో చేరారు. కాక్ పిట్ లో జరుగుతున్న గొడవ వల్ల ఒక పైలెట్ చేసిన విద్రోహ చర్య వల్ల విమానం అకస్మాత్తుగా 1700 అడుగులకు దిగిపోవడంతో కలిగిన భయంతో ప్రయాణికులు భయపడిపోయారు. అయినా విమానాన్ని మరో పైలెట్ సాయంతో కంట్రోల్ చేసి తనకు కత్తి గాయమైనా సరే పొడిచిన పైలెట్ ను అదుపులో ఉంచుకుంటు క్షేమంగా అందరిని దించేశాడు. ఫ్లైట్లో 180 మంది ప్రయాణికులలో వందమంది ఇజ్రాయిల్ దేశస్తులు. సౌదీ అరేబియాలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది.ఇజ్రాయిల్ ప్రధానమంత్రి కూడా మచ్చర్ ను హీరోగా అభినందించాడు. భారతదేశానికే గర్వకారణమైన వ్యక్తి అని కీర్తించారు…