Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 7:38 pm Posted by : ramakrishna

పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సీజ్

 

. . . డ్రగ్స్ పార్టీ వ్యవహారంతో పాటు తెర పైకి భు అక్రమాల అంశం

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను పోలీసులు రెవెన్యూ అధికారులతో కలిసి సీజ్ చేశారు. డ్రగ్స్ పార్టీ వ్యవహారంతో పాటు భూ అక్రమాల అంశం కూడా ఇప్పుడు తెర పైకి రావడంతో ఈ కేసు విచారణ వేగవంతమైంది. మొయినాబాద్ లోని రోహిత్ ఫామ్ హౌస్ గత కొంత కాలంగా వివాదాలకు నిలయంగా మారింది. తాజాగా రెవెన్యూ అధికారులు జరిపిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, అసైన్డ్ భూమిలో ఈ ఫామ్ హౌస్ ను నిర్మించారని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఈ నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలోనే ఫామ్ హౌస్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. డ్రగ్స్ పార్టీ జరిగిన సమయంలో అక్కడికి వచ్చిన వారి వాహనాలను సైతం పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు. ఈ వాహనాల యజమానులు ఎవరు.. పార్టీకి ఎవరెవరు హాజరయ్యారు ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక విచారణ బృందం కోర్టు తీర్పు అనంతరం రోహిత్ రెడ్డి ని కస్టడీలోకి తీసుకోనుంది. అనంతరం ఆయన్ని నేరుగా ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి, అక్కడ జరిగిన పార్టీ వివరాలు, ఇతర ఆధారాల కోసం క్షేత్ర స్థాయిలో విచారించనున్నట్లుగా సమాచారం.