రోడ్లపై వడ్ల కుప్పలు.. ప్రయాణికులకు తిప్పలు…
బాన్సువాడ, బతుకమ్మ : రోజుకు వందలాది వాహనాలు తిరిగే నిజామాబాద్ - బాన్సువాడ ప్రధాన రహదారి పై వడ్లు ఆరబోయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వరి పంట కోత సీజన్ లో ఇదే సమస్య ఎదురవుతోంది. గడిచిన ఏళ్లలో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రోడ్లపై వడ్ల కుప్పల కారణంగా ప్రమాదాలు జరిగి చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్ద స్థలం లేకపోవడం వల్ల రైతులు రోడ్లపై వడ్లు ఆరబోస్తున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతున్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని వాహనదారులు...