బ్రిడ్జిపై వడ్ల కుప్పలు

ఇబ్బందుల్లో ప్రయాణికులు   ఆర్మూర్, బతుకమ్మ: ఆలూరు నుండి ఆర్మూర్‌కు వెళ్లే ప్రధాన రహదారిలోని బ్రిడ్జిపై ఓ రైతు వడ్లను ఆరబోశాడు. వడ్ల కుప్పలతో పాటు చెట్లు, ఇతర వస్తువులను అడ్డంగా ఉంచడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శనివారం ఒక బైక్ వడ్ల కుప్పకు అడ్డంగా ఉన్న చెట్టును ఢీకొనబోయి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ దృశ్యం చూసిన ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రహదారిపై ప్రతిరోజూ వందలాది వాహనాలు సాగనెత్తుతుంటే, బ్రిడ్జిపైనే వడ్లు ఆరబోశారని అనడం...