Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 June 2025, 8:04 pm Posted by : ramakrishna

శారీరక మానసిక సామాజిక నష్టాలు కలుగుతాయి

మోర్తాడ్, బతుకమ్మ: యువత డ్రగ్స్ దుష్ప్రభావాలకు అలవాటు పడితే శారీరక మానసిక సామాజిక నష్టాలు కలుగుతాయని మోర్తాడ్ ఎస్సై విక్రమ్ అన్నారు. మోర్తాడ్ పోలీస్ ఆధ్వర్యంలో మంగళవారం మత్తుపదార్థాల వినియోగంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో మహాత్మా జ్యోతిబా ఫూలే BC సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల  విద్యార్థులకు ప్రత్యేకంగా డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి పోలీస్ అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. యువత దేశ భవిష్యత్తు కాబట్టి వారిని మత్తుపదార్థాల నుంచి రక్షించడం సమాజ బాధ్యత అని తెలియపరిచారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కేజీవీబీ ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.