Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 April 2025, 7:05 pm Posted by : ramakrishna

ఇండియా ఉపఖండానికి “పూలే పవర్ ఫుల్ మెన్”

బతుకమ్మ,మోర్తాడ్: ఆధునిక భారతంలో జ్యోతిరావు పూలే పవర్ ఫుల్ మహామానవుడు. దేశం పట్ల ఆయన చేసిన అద్భుతమైన కార్యాల వల్ల ఆయనకు “మహాత్మా” అనే బిరుదు ముంబై ఓ/బీసీ ప్రజలు బహుకరించారు. తండ్రి రైతు. జ్యోతిరావు కూడా వ్యవసాయం చేశారు. ఆయన రైతుల దోపిడి నిర్మూలన పట్ల పుస్తకం రాశారు. పలు కవితలు నాటికలు వ్యాసాలు గ్రంథాలు రాసిన గొప్ప సాహిత్యవేత్త. పువ్వుల తోట, కూరగాయల పంట, పండ్లు పండించి పూణే నుంచి ముంబై సిటీకి విక్రయం చేసేవారు పూలే దంపతులు. అనంతరం 7ఏండ్ల పాటుగా పూణే సిటీకి కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించి 2సిటీలలో అనేక భవనాలు, రోడ్లు, వంతెనలు నిర్మించిన గొప్ప కాంట్రాక్టర్ గా, పూణే సిటీ నిర్మాతగా బ్రిటిష్ వారి నుంచి ఫూలే గారు మన్ననలు పొందిన ఘనత ఉంది. సావిత్రిమాయి ఫాతిమాషేక్ లతో కల్సి 4జిల్లాలో 18 పాఠశాలలు స్థాపించి “ఎడ్యుకేషన్ ఫ్రం బిలో” అనే విద్యావిధానం ఉండాలంటూ “హంటర్ కమిషన్” కు నివేదికిచ్చిన గొప్ప విద్యావేత్త. పూలే తన సత్యశోధక్ సంస్థ ద్వారా మనువాదానికి విరుద్ధంగా మైనార్టీ ఓ/బీసీ ఎస్సీ ఎస్టీలకు చెందిన 316 కులాల ప్రజల్లో ఉద్యమ స్పూర్తి నింపిన సమాసమాజ ఉద్యమనేత. వీరిని అంబేడ్కర్ తన గురువుగా స్వీకరించడంలో మహామేధాసుకు ప్రతీకగా మనం చూడాలంటూ ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు అంగుళి మాలజీ ఎలుగెత్తి చాటారు. శుక్రవారం దళిత సంక్షేమ సంఘంచే జిల్లా నిజామాబాద్ మోర్తాడ్ మండల కేంద్రంలో పూలే విగ్రహం వద్ద జయంతిని జరిపారు. ఇందులో డిఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి జాంబవ చమార్, మామిడి రవి, ఎం.గంగాధర్, బండి సాగర్, సదానాథ్, నర్సారెడ్డి ముదిరాజ్ పాల్గొన్నారు. విప్లవయోధ్ధ పూలేకు జోహార్ల నినాదాలతో మండలం మారుమోగింది.