పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్టించాలి

రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : బహుజనుల సాధికారతకు ప్రతీకగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్టించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం పూలే జయంతి సందర్భంగా మింట్ కాంపౌండ్ వద్ద పూలే విగ్రహానికి పూలమాలవేసి కవిత నివాళులు అర్పించారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ పూలే విగ్రహం ఏర్పాటు సాధనకై అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మద్దతు కూడగట్టామన్నారు. రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి అడ్డంకి తొలగిపోయిందన్నారు.  ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుతో తొమ్మిది...