Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 7:38 pm Posted by : ramakrishna

సాంఘిక దురాచారాలను దూరం చేసేందుకు పూలే ఎంతగానో శ్రమించారు

 

. . . మాహాత్మ జ్యోతిబా పూలే 200 వ జయంతి ఉత్సవాలలో కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

అడుగడుగునా అవరోధాలు, అవమానాలు ఎదురైనప్పటికీ ఏమాత్రం చలించకుండా సాంఘిక దురాచారాలను దూరం చేసేందుకు పూలే ఎంతగానో శ్రమించారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దుబ్బ లోని మున్నూరు కాపు కల్యాణ మండపంలో పూలే జయంతి వేడుక నిర్వహించారు. అంతకుముందు వినాయకనగర్ లోని మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహానికి అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ కే.ఉమారాణి, ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, బీసీ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

 

Phule worked hard to eradicate social evils.

 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలో నెలకొని ఉన్న రుగ్మతలను పారద్రోలేందుకు మహాత్మ జ్యోతిబాపూలే కొనసాగించిన కృషి అమోఘమని అన్నారు. అణగారిన వర్గాలు సమానత్వం సాధించాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించి వారికి విద్య అందేలా విశేషంగా కృషి చేశారని, మహిళల విద్య కోసం ప్రత్యేకంగా మొట్టమొదటి పాఠశాలను స్థాపింపజేశారని అన్నారు. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం బీ.సీ గురుకులాలకు జ్యోతిబాపూలే పాఠశాలలుగా నామకరణం చేస్తూ నాణ్యమైన భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తోందన్నారు. మహనీయులు చూపిన బాటలో పయనిస్తూ వారి ఆశయాల సాధన కోసం కృషి చేసినప్పుడే మన జీవితానికి కూడా సార్థకత చేకూరుతుందన్నారు.

 

Phule worked hard to eradicate social evils.

 

జ్యోతిబా పూలే చూపిన బాటలో పయనిస్తూ, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు. జయంతి సభలో మేయర్ ఉమారాణి, ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ లు మాట్లాడుతూ, జ్యోతిబా పూలే సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, బీసీ సంఘాల బాధ్యులు బుస్స ఆంజనేయులు, నరాల సుధాకర్, నరేందర్ గౌడ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

 

Phule worked hard to eradicate social evils.