Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 August 2025, 7:21 pm Posted by : ramakrishna

ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిజామాబాద్ పట్టణంలో నగర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికలు  నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికలు రెండు గంటల వరకు  సుమారుగా 99% ఓటింగ్ అయినట్టుగా ఎలక్షన్ ఆఫీసర్స్ వెల్లడించారు. ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా ఓటును  వినియోగించుకున్నారు. నిజామాబాద్ లో జరిగిన ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఎలక్షన్లో  అధ్యక్షుడిగా శివాజీ, వైస్ ప్రెసిడెంట్గా షారిక, కార్యదర్శిగా నరేందర్, కోశాధికారిగా శ్రీకాంత్, జాయింట్ సెక్రెటరీగా రామరాజు విజయం సాధించారు. అనంతరం గెలిచిన అభ్యర్థులకు గెలుపు పత్రాలను అందజేశారు. ఈ విజయానికి కృషి చేసిన ఎలక్షన్ ఆఫీసర్లకు ఓటు హక్కు వినియోగించుకున్న ఫోటోగ్రాఫర్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

Photo and Videographer Association Executive Committee Election