ఆర్మూర్, బతుకమ్మ: ఆర్మూర్ లోని స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం ఇటీవల పీహెచ్డీ డాక్టరెట్ సాధించిన పాస్టర్ హనోక్, అలాగే అంతర్జాతీయ అంబెడ్కర్ అవార్డు అందుకున్న బంగారు సాయిలు కు డా అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వీరిరువురిని ఘనంగా సన్మానిచడం జరిగింది. ఈ సందర్బంగా అంబేడ్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు ఇత్వర్ పేట్ లింగన్న మాట్లాడుతూ జాతి భవిష్యత్తు అదే జాతిలోని విద్యావంతులు ఉద్యోగస్తులు మేధావులు ఆర్థికంగా బాగుపడ్డవాళ్ళు ఆ జాతిని తీర్చిదిద్దాలి అని అంబేడ్కర్ అన్నారని గుర్తు చేశారు. అలాగే మరో నాయకుడు పెద్ద భోజన్న మాట్లాడుతూ మేధావులను సామాజిక కార్యకర్తలను సన్మానించి ప్రోత్సహం అందిస్తే వారు ఇంకా పనిచేస్తారని పేర్కొన్నారు. బంగారు సాయిలు చేసిన సేవలు అనేకం జిల్లాలో ఎక్కడ దౌర్జన్యం జరిగిన అక్కడ బంగారు సాయిలు ఉంటారని తెలియజేశారు. కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గం అధ్యక్షులు జిన్నా జనర్దన్, మోర్తాడ్ అధ్యక్షులు అంగుళి మాలజీ వారిరువురికి చాలువతో సన్మానించారు. అలాగే రాజ్యాంగం పుస్తకంను బండ ప్రసాద్, షేక్ ఉస్సేన్ ఇచ్చారు. కార్యక్రమం లో న్యాయవాది జిజి రామ్,రాజు తదితరులు పాల్గొన్నారు.