కారేగాం తండా సర్పంచ్ డాక్టర్ రమావత్ లాల్‌సింగ్‌కు పీహెచ్‌డీ డాక్టరేట్

  హైదరాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం కారేగాం తండా గ్రామ సర్పంచ్‌గా ప్రజలకు సేవలందిస్తూనే ఉన్నత విద్యను కొనసాగించి పీహెచ్‌డీ సాధించిన డాక్టర్ రమావత్ లాల్‌సింగ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో “సమకాలీన హిందీ ఉపన్యాస్ మే సాంప్రదాయిక్ సంఘర్ష్” అనే అంశంపై పరిశోధన పూర్తి చేసిన ఆయనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన 85వ స్నాతకోత్సవంలో పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కాన్వొకేషన్ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్...