నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ – మూడవ సెమిస్టర్ (ఎం ఏ/ఎం కామ్/ఎమ్మెస్సీ/ఎంబీఏ/ఎంసీఏ), ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ (ఐఎంబీఏ – తొమ్మిదవ సెమిస్టరు) రెగ్యులర్ పరీక్షలు, మూడో రోజు ప్రశాంతంగా జరిగాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంట చంద్రశేఖర్ తెలిపారు. ఈ పరీక్షలు గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల నిజామాబాద్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోధన్, ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామారెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్, ఎస్.ఆర్.కే. ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాన్సువాడ, యూనివర్సిటీ కళాశాల మెయిన్ క్యాంపస్, యూనివర్సిటీ కళాశాల సౌత్ క్యాంపస్ భిక్కనూర్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కేంద్రాలలో జరిగాయని పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1977 మంది విద్యార్థులు ఉండగా 1899 మంచి విద్యార్థులు హాజరయ్యరని, 78 మంది గైరాజరయ్యారని తెలిపారు.