Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 August 2025, 4:58 pm Posted by : ramakrishna

గణేష్ మండపాల సమస్యలపై కమిషనర్‌కు వినతి పత్రం

బతుకమ్మ, బోధన్: బోధన్ పట్టణంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా  భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ అధ్యక్షులు పసువులేటి గోపి కిషన్  ఆధ్వర్యంలో గణేష్ మండపాల దగ్గర ఎదురవుతున్న సమస్యలను మున్సిపల్ కమిషనర్‌కి వివరించి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మండపాల వద్ద సుచి శుభ్రత, నాళాల శుభ్రత నిరంతరం ఉండేలా చూడాలని, ఎలక్ట్రిసిటీ సరఫరా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, అన్నదానాల సమయంలో మంచినీటి సరఫరా కల్పించాలనే అభ్యర్థనలు చేశారు. ఇస్తరాకులు ఎత్తివేయడానికి కార్మికులు, ట్రాక్టర్‌లు నియమించాలని, ప్రతిరోజు మండపాల దగ్గర శుభ్రపరచి ముగ్గు వేయాలని, రోడ్లపై గుంతలను పూడ్చాలని, వర్షపు నీరు గణేష్ మండపాల దగ్గరకు రాకుండా నాళాలను తరచూ శుభ్రం చేయాలని కోరారు. ఈ వినతి పత్ర సమర్పణలో భాజపా బోధన్ పట్టణ ప్రధాన కార్యదర్శి రాజుల దేవి పవన్ కుమార్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఏనుగంటి గౌతమ్ గౌడ్, భాజపా పట్టణ ఉపాధ్యక్షులు దేవకట్టే శివరాజ్, సీనియర్ నాయకులు గొడుగు ధర్మపురి, ఏషాల సురేందర్, పెరిక వెంకటేష్, గుంత గంగాధర్, అడ్లూరి ఫణి, కలికోట కృష్ణ, నిమ్మ శ్రీనివాస్, లోసురే అనిల్, బిల్లా విజయ్, ఏనుగంటి గంగా సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Petition to the Commissioner on the issues of Ganesh Mandapam