బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా విద్యా సంస్థల స్థాపన, పాలిటెక్నిక్ కాలేజ్ అప్గ్రేడ్ బీటెక్ కాలేజ్ గా జిల్లా విద్యా రంగంలో తక్షణ అభివృద్ధి కోసం కొన్ని కీలకమైన అంశాలను టీజీవిపి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రోత్సహించి, నిజామాబాద్‌లో మహిళల డిగ్రీ కళాశాల, వెటర్నరీ కళాశాల, వ్యవసాయ కళాశాల, మరియు ఫార్మసీ కళాశాల వంటి సంస్థలను స్థాపించాలని కోరడము అనివార్యంగా ఉంది. ఈ సంస్థల స్థాపన, యువతకు మెరుగైన విద్యా అవకాశాలను కల్పించడంతో పాటు, వారి భవిష్యత్తు అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. విజయవంతమైన పోరాటం, మరియు రాష్ట్ర ఈ అభివృద్ధి, జిల్లా విద్యా రంగం, స్థానిక ప్రజల ప్రగతికి కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు అఖిల్, వినయ్ సుజిత్, సాయి, తదితరులు పాల్గొన్నారు.