వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి పత్రం

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్ కి వినతి పత్రం అందించారు. జంగంపల్లి గ్రామంలో పేద ప్రజలు పోరాడి సాధించుకున్న నివాసం ఉంటున్న మల్లు స్వరాజ్యం కాలనీలో రెండు సంవత్సరాలుగా పేద ప్రజలు అంధకారంలో జీవిస్తున్నారని వారికి హౌస్ నెంబర్ కేటాయించాలని కరెంటు మీటర్లు మంజూరు చేయాలని కోరడం జరిగిందన్నారు. పేద ప్రజలు పోరాడి సాధించుకున్న స్థలం మీద గ్రామంలోని ఇద్దరు ముగ్గురు పెద్దలు స్వార్థ ప్రయోజనాల కోసం చట్టాన్ని ధిక్కరించి కోర్టు ఆర్డర్ ను...