Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 November 2024, 6:34 pm Posted by : ramakrishna

వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి పత్రం

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్ కి వినతి పత్రం అందించారు. జంగంపల్లి గ్రామంలో పేద ప్రజలు పోరాడి సాధించుకున్న నివాసం ఉంటున్న మల్లు స్వరాజ్యం కాలనీలో రెండు సంవత్సరాలుగా పేద ప్రజలు అంధకారంలో జీవిస్తున్నారని వారికి హౌస్ నెంబర్ కేటాయించాలని కరెంటు మీటర్లు మంజూరు చేయాలని కోరడం జరిగిందన్నారు. పేద ప్రజలు పోరాడి సాధించుకున్న స్థలం మీద గ్రామంలోని ఇద్దరు ముగ్గురు పెద్దలు స్వార్థ ప్రయోజనాల కోసం చట్టాన్ని ధిక్కరించి కోర్టు ఆర్డర్ ను సైతం పక్కనపెట్టి గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తమ తీరు మార్చుకోక పోతే జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాలని హెచ్చరించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూ సాధన సమితి సభ్యులు నారా బోయిన అర్జున్ నీరుడి బాల్ రాజ్ పేరం నర్సవ్వ జంగం సావిత్రి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.