బతుకమ్మ : నాగిరెడ్డిపేట : సర్పంచ్, మండలపరిషత్, జిల్లా పరిషత్ ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి నాగిరెడ్డిపేట్ మండల మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి సోమవారం వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లోని శాసనమండలి లో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేసినట్లు మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయని, స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా, పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ ని కోరినట్లు తెలిపారు.