Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 September 2025, 4:06 pm Posted by : ramakrishna

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేత

బతుకమ్మ, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలో సోమవారం టిఆర్ఎస్, బిజెపి, సిపిఐ, పార్టీల ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు మద్దతుగా అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. డబుల్ బెడ్ రూమ్ బిల్లులను చెల్లించకుండా లబ్ధిదారులను అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, రెండు సంవత్సరాలుగా బిల్లులు లేక లబ్ధిదారులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని వాపోయారు ఒకరి బిల్లులను మరొకరికి ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ బిల్లులలో అవినీతికి పాల్పడ్డారని ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం నాయకులు తమ అనుచరులకు డబుల్ బెడ్ రూమ్ బిల్లులను అందించారని ఇంటి నిర్మాణం చేపట్టుకున్న లబ్ధిదారులకు మాత్రం బిల్లులు ఇవ్వలేదని మండిపడ్డారు ఈ వ్యవహారంపై డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ మాజీ ప్రజాప్రతినిధుల పాత్రపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కొందరు ప్రజాప్రతినిధులు తమ పార్టీ అధికారంలో లేదని బిల్లుల కోసం వెళ్ళిన వారికి చెప్పడంపై నేతలు మండిపడ్డారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరులు ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ఈ నెలాఖరుకు హౌసింగ్ శాఖ అధికారి నాగేశ్వరరావు పదవి విరమణ చేయనున్నారని వెంటనే లబ్ధిదారులకు బిల్లులు ఇప్పించాలని డిమాండ్ చేశారు కొందరు ప్రజాప్రతినిధులు 23 మందికి మాత్రమే బిల్లులు రావాల్సి ఉందని చెప్పడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఎవరెవరికి ఎన్ని బిల్లులు రావాలో బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు సుమారు 100 మంది వరకు లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ బిల్లులు రావాల్సి ఉందని బిల్లులు ఇవ్వకుండా మాయమాటలు చెబుతున్నారని కొందరు ప్రజాప్రతినిధులు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని స్పష్టం చేశారు ప్రజాస్వామ్యంలో బెదిరింపుల గురి చేస్తే ఊరుకునేది లేదని అలాంటి వారిపై కార్యాచరణ చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు వారం రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ బిల్లులు చెల్లించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు పార్టీలకు అతీతంగా అందరం సిద్ధమవుతామని స్పష్టం చేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు తెల్ల రవికుమార్ మోరే కిషన్  సిపిఐ మండల కార్యదర్శి  విఠల్ గౌడ్,బిజెపి మండల అధ్యక్షుడు ఏముల నవీన్,బిజెపి మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పుల్లెల మోహన్రావు టిఆర్ఎస్ నాయకులు సమీర్, కప్ప సంతోష్, తేల్ల చిన్న అరవింద్, శంకర్ గౌడ్, గంగా ప్రసాద్ గౌడ్, మామిడి నవీన్, మహేష్ రెడ్డి, రుద్రంగి సందీప్, మేత్రి గంగాధర్,  ఆకుల విఠల్,పోతయ్య,బిజెపి నాయకులు మామిడి శ్రీనివాస్,మామిడి సాయిలు, సిపిఐ నాయకులు నల్ల గంగాధర్,గుడాల రాములు, గోపాల్,  డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

Petition presented to Ambedkar statue