Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 July 2025, 11:31 am Posted by : ramakrishna

ఏపీ, టీజీ నియోజకవర్గాల పునర్విభజనపై పిటిషన్ కొట్టివేత

ఇలాంటి పిటిషన్లు అనుమతిస్తే వరదల్లా వస్తాయని సుప్రీం వ్యాఖ్క్ష్య

డిల్లీ, బతుకమ్మ:  ఏపీ తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టి వేసింది. 2022లో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం తుది ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ విభజన చట్టం సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని పిటిషనర్ కోరారు. జమ్మూ కాశ్మీర్ లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టారని, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇలాంటి పిటిషన్లను అనుమతించడం వల్ల ఇతర రాష్ట్రాల్లోనూ పిటిషన్లు వరదల్లా వస్తాయని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.