Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 December 2025, 3:22 pm Posted by : ramakrishna

జీహెచ్ఎంసీలో డివిజన్ల పెంపుపై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్, బతుకమ్మ : జీహెచ్ఎంసీ లోని డివిజన్ల పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని ఉన్నత న్యాయస్థానాన్ని పిటిషనర్ వినయ్ కుమార్ కోరారు. ఈపిటిషన్ పై జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. డివిజ న్ల పునర్విభజనలో అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని వినయ్ కుమార్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. తన అభ్యంతరాలను పరిగణన లోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు.