Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 October 2024, 6:38 pm Posted by : ramakrishna

అనుమానాదాస్పద స్థితిలో వ్యక్తి మృతి

బతుకమ్మ, నవీపేట్                                                                                                                                                                  

మండల కేంద్రానికి చెందిన మాజీ రేషన్ డీలర్ కొలాస సంజీవ్ కుమార్ (50), అనే వ్యక్తి ఆదివారం అనుమానాదాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం నవీపేట్ మండల కేంద్రానికి చెందిన సంజీవ్ కుమార్ గతంలో రేషన్ డీలర్ గా పనిచేసేవాడు. ఈ మధ్యన ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడని,సదరు మృతుడు అప్పుడప్పుడు తన స్నేహితులతో మద్యం తాగేవాడని, మద్యం తాగవద్దని మృతుని భార్య స్నేహితులకు చెప్పిందని అయినా దసరా రోజున రాత్రి ఇంట్లో జంబి ఇచ్చి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శనివారం రాత్రి మృతుడు సంజీవ్ తన స్నేహితుడు శ్రీనివాస్ (బిల్లా) తో కలిసి బయటకు వెళ్లి నవీపేట్ లోని ఓ ప్రైవేట్ వెంచర్ లో మద్యం తాగడని తెలిపారు, ఆదివారం ఉదయం స్థానికులు మృతుని భార్య కు తన భర్త శివాజీ చౌక్ వద్ద గల కాలువ లో పడి మృతి చెందాడని సమాచారం ఇవ్వగా ఘటనస్థలానికి వెళ్లి చూడగా అనుమానాదాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. ఘటన స్థలాన్ని స్థానిక పోలీసులు, నార్త్ రూరల్ సి.ఐ. సతీష్ పరిశీలించారు. మృతుని భార్య కోలాస సుమలత ఫిర్యాదు మేరకు అనుమానాదాస్పద మృతి కేసు నమోదు చేశామని నార్త్ రూరల్ సి.ఐ. సతీష్ తెలిపారు. పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్నీ జిల్లా కేంద్ర ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించామని ఎస్సై కె.వినయ్ తెలిపారు.