బాణాసంచా దుకాణాలకు అనుమతి తీసుకోవాలి : రూరల్ సీఐ తిరుపతయ్య
బాన్సువాడ, బతుకమ్మ : బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జనావాసాల మధ్య కాకుండా బహిరంగ ప్రదేశాలలో మాత్రమే దుకాణాలు పెట్టుకోవాలని సూచించారు. పోలీసుల అనుమతితో పాటు ఫైర్ అధికారుల అనుమతి కూడా తప్పనిసరిగా ఉండాలన్నారు. నిబంధనలు పాటించాలని దుకాణదారులను కోరారు.