Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 October 2025, 7:26 pm Posted by : ramakrishna

దీపావళి టపాసుల విక్రయాలకు అనుమతి తప్పనిసరి

  • ఎస్సై సందీప్

 

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శుక్రవారం  కమీషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాదు ఆదేశాల మేరకు ఇందల్వాయి మండలంలో బాణాసంచా దుకాణం యజమానులకు,గోదాములు నిర్వహించే వ్యాపారులకు సంబంధిత అధికారుల అనుమతులు తీసుకోని దుకాణాలు నిర్వహించి తగు జాగ్రత్తలను పాటిచాలని అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్సై సందీప్ సూచించారు.లేనియెడల అట్టి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై సందీప్ అన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సై సందీప్ పాల్గొన్నారు.