Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 November 2025, 2:25 pm Posted by : ramakrishna

ర్యాలీలకు అధికారుల అనుమతి తప్పనిసరి

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాదు  జిల్లాలో  గ్రామపంచాయతీ ఎన్నికల సందర్బంగా ఎవరైనా ర్యాలీ లు నిర్వహించాలి అనుకుంటే సంబందించిన రిటర్నింగ్ అధికారి, పోలీస్ అధికారుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం చట్టపరమైన చర్యలకు కారణమవుతుందని తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, మరియు నిర్వాహకులు నియమాలను పాటించి, ఎన్నికల ప్రక్రియ సవ్యంగా సాగేందుకు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అదే విధంగా నిజామాబాద్ జిల్లా లో డిజే ల వాడకం పూర్తిగా నిషేధం అని తెలిపారు. శాంతి భద్రతలు,  ప్రజాస్వామ్య వ్యవస్థ రక్షణలో అందరి భాగస్వామ్యం అత్యంత కీలకం అని పేర్కొన్నారు.