Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 2:41 pm Posted by : ramakrishna

నిబంధనల ప్రకారం డీజేలకు అనుమతి ఇవ్వాలి

 

. . . శాంతి కమిటీ సమావేశంలో సీపీని కోరిన బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

ఇందూర్, బతుకమ్మ:

 

వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నిబంధనల ప్రకారం డీజేలకు అనుమతి ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి కోరారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో వినాయక చవితి పురస్కరించుకుని శాంతి కమిటీ సమావేశంలో దినేష్ కులాచారి మాట్లాడుతూ హిందువులు కేవలం వినాయక చవితి, శ్రీరామనవమి, హనుమాన్ జన్మోత్సవం, దేవీ నవరాత్రులు, ఛత్రపతి శివాజీ జయంతి వంటి ఐదు ప్రధాన పర్వదినాల్లో మాత్రమే సౌండ్ సిస్టమ్ ను ఉపయోగిస్తారన్నారు. 30-08-2000 నాటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిర్దేశించిన పరిమితులకు లోబడి సౌండ్ సిస్టమ్‌కు అనుమతులు మంజూరు చేయాలి తప్ప, ఉత్సవాలను అడ్డుకోకూడదన్నారు. అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల జీవో ప్రకారం గణేష్ ఆగమనం,నిమజ్జన ఊరేగింపులకు పూర్తిస్థాయిలో అనుమతులు ఇవ్వాలని కోరారు. దీనిపై సీపీ స్పందిస్తూ గణేష్ ఆగమనం, నిమజ్జనం కార్యక్రమాల్లో రెండు స్పీకర్లతో కూడిన సౌండ్ సిస్టమ్‌ ను నిబంధనల ప్రకారం వినియోగించుకోవడానికి అనుమతి ఇస్తామని తెలిపారన్నారు.