తాగునీరు, పారిశుధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం
మంత్రి జూపల్లి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నగరంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో తాగునీరు, పారిశుధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేలా సుమారు 400 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతోందని రాష్ట్ర ఎక్సయిజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ వెల్లడించారు. నగరంలో పలు అభివృద్ధి పనులకు ఆదివారం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్...