Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 7:48 pm Posted by : ramakrishna

జేఈఈ అడ్వాన్స్డ్-2026లో ఎస్‌ఆర్ విద్యాసంస్థల విద్యార్థుల ప్రతిభ

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

జేఈఈ అడ్వాన్స్డ్-2026 ఫలితాల్లో నిజామాబాద్ ఎస్‌ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు.

Performance of students from SR educational institutions in JEE Advanced-2026

ఈ ఫలితాల్లో వై. శ్రీ వర్థన్ (ఎస్టీ కేటగిరి) ఆల్ ఇండియా ర్యాంకు 203, ఎన్. సురేష్ (ఎస్టీ) 1060, డి. శ్రీకాంత్ (ఎస్టీ) 3216, జె. యశ్వంత్ (ఎస్టీ) 3424, ఎం. నివాస్ రెడ్డి (జనరల్) 5191, ఎన్. కృపాకర్ (ఎస్సీ) 5454, జె. అఖిలేశ్ (ఎస్సీ) 5617, ఎస్. విశ్వంత్ (ఎస్సీ) 5931, ఏ. చరణ్ తేజ (బీసీ) 9397 ర్యాంకులు సాధించారు.

Performance of students from SR educational institutions in JEE Advanced-2026

మొత్తం పది వేల లోపు 9 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించడం విశేషం.

Performance of students from SR educational institutions in JEE Advanced-2026

ఈ సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో డీజీఎం గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్‌ఆర్ విద్యాసంస్థల్లో అమలు చేస్తున్న టాప్ క్లాస్ షెడ్యూల్స్, ఆధునిక అప్‌డేటెడ్ స్టడీ మెటీరియల్, వారాంతపు పరీక్షలు, సగటు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నిర్వహిస్తున్న అదనపు తరగతుల ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు.

Performance of students from SR educational institutions in JEE Advanced-2026

ఇంటర్మీడియట్ ప్రారంభం నుంచే కోచింగ్ తరగతులను సమన్వయంతో నిర్వహించడం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడిందన్నారు.

Performance of students from SR educational institutions in JEE Advanced-2026

నిజామాబాద్ జోనల్ ఇన్‌చార్జ్ శ్రీకాంత్ మాట్లాడుతూ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులకు విజయ సాధనలో ఎస్‌ఆర్ కాలేజ్ గత 12 సంవత్సరాలుగా విశ్వసనీయ గమ్యస్థానంగా నిలుస్తోందన్నారు.

Performance of students from SR educational institutions in JEE Advanced-2026

మెరుగైన హాస్టల్ సౌకర్యాలు, పరిశుభ్రమైన భోజన వసతులు విద్యార్థుల విద్యా ప్రగతికి తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. అకాడమిక్ డీన్ రాంబాబు మాట్లాడుతూ, ఎంపీసీ విభాగంలో ఫోకస్ ప్లస్, ఫోకస్, స్పార్క్, టైటానిక్ వంటి ప్రత్యేక అకాడమిక్ ప్రోగ్రామ్‌ల ద్వారా విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నామన్నారు.

Performance of students from SR educational institutions in JEE Advanced-2026

ఇంటర్ విద్యతో పాటు ఈఏపీసెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులను ఎస్‌ఆర్ చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సీఈఓ సురేందర్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ అజేందర్ రెడ్డి, హన్మంత్ రావు, శ్రీధర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మురళీధర్, నరసింహ రెడ్డి, జోనల్ అకౌంట్ ఆఫీసర్ రమేష్ రెడ్డి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Performance of students from SR educational institutions in JEE Advanced-2026