Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 5:57 pm Posted by : ramakrishna

ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

 

. . . ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశంలో ఆర్డీవో

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించి, ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ ఆదేశించారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజలకు అందుతున్న సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో మండల అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల అమలు, గ్రామస్థాయి సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సేవల మెరుగుదలపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ పథకాల అమలు స్థితిగతులను పరిశీలించారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డి తహసీల్దార్ ప్రేమ్ కుమార్ ఎల్లారెడ్డి, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ మహేష్, ఎంఈఓ రాజు, సీడీపీఓ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

People's problems should be solved immediately