Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 July 2025, 8:39 pm Posted by : ramakrishna

ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్న

. . .బోనం ఎత్తిన పోచారం

బాన్సువాడ, బతుకమ్మ :

బాన్సువాడ పట్టణంలోని మాత శిశు ఆస్పత్రిలో మంగళవారం ఆషాఢ మాసం బోనాల పండగను సంబురంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి  బోనం ఎత్తుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్​ సైతం బోనం ఎత్తుకుని సంబురాల్లో పాలుపంచుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ.. ప్రజలు ఆయురారగ్యాలతో పచ్చని పంటలతో కళకళలాడాలని మొక్కుకున్నానన్నారు. సంబురాల్లో ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ఆసుపత్రి సిబ్బంది, పీఎస్ఆర్ టాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు, అంజిరెడ్డి, ఎజాజ్, నర్సన్న తదితరులు పాల్గొన్నారు…