Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 6:47 pm Posted by : ramakrishna

ప్రజలు నిస్సంకోచంగా ప్రజావాణిలో సమస్యలు తెలియజేయాలి

 

. . . ఎల్లారెడ్డి ఆర్డీఓ ఆర్.ప్రభాకర్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ప్రజలు తమ సమస్యలను నిస్సంకోచంగా ప్రజావాణిలో తెలియజేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పరిపాలన కొనసాగుతుందని ఎల్లారెడ్డి ఆర్డీఓ ఆర్.ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ప్రజల నుండి నేరుగా వినతులు స్వీకరించి, ప్రతి ఫిర్యాదును నిష్పాక్షికంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం ఒక ఫిర్యాదు దరఖాస్తు అందగా, అది రెవెన్యూ శాఖకు సంబంధించినదని అధికారులు తెలిపారు. ఫిర్యాదును సంబంధిత శాఖకు పంపించి, నిర్ణీత గడువులో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఆర్.ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలకు ప్రభుత్వమే అండగా ఉంటుందని, ప్రజావాణి ద్వారా అందే ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే ప్రజావాణి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.